భారీ లేఆఫ్‌ల తర్వాత ఉద్యోగులకు గూగుల్ మరొక ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అతి కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ ఈమెయిల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దాదాపు 12మంది కంటే ఎక్కువ ఉద్యోగులకు ప్రమోషన్ రాకపోవచ్చని ఈమెయిల్‌లో గూగుల్ సంస్థ ఉద్యోగులకు సూచించిందట. గడ్డు ఆర్థిక పరిస్థితుల కారణంగా నియామకాల జోరు తగ్గింది. కొద్ది మొత్తంలో మాత్రమే నియామకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతమున్న ఉద్యోగులు అదే హోదాలో కొనసాగేందుకు సిద్ధంగా ఉండాలని కంపెనీ సూచించినట్లు తెలుస్తోంది.