గోపిచంద్ , రాశిఖన్నా జంటగా నటిస్తున్న ‘పక్కా కమర్షియల్’ మూవీ ట్రైలర్ గ్లింప్స్ విడుదలైంది. ట్రైలర్ జూన్ 12న గోపీచంద్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుంది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. జులై 1న మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లకు మంచి స్పందన లభిస్తుంది. గోపీచంద్ ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. మారుతీ మార్క్ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతుందని తెలుస్తుంది.