గోపిచంద్ హీరోగా నటించిన ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ నిన్న రిలీజైంది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్‌కు ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఎవరికైనా కాల్ చేసి డబ్బు అడగాల్సిందిగా యాంకర్ కోరింది. దీంతో గోపీచంద్ డైరెక్టర్ మారుతీకి కాల్‌చేశాడు. నాకు రూ.10 వేలు వెంటనే కావాలి అని అడిగాడే. అదేంటి పదివేలేనా.. నేనింకా పది లక్షలేమో అనుకున్నా అన్నాడు. వెంటనే ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇక మరో టాస్క్‌లో ఒక నిమిషంలో రూ.50 వేలు లెక్కించాల్సిందిగా అడగ్గా ఆయన 30 సెకన్లలోనే పూర్తి చేసి షాకిచ్చాడు.