అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న గోటబాయ

© ANI Photo

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స మళ్లీ అమెరికా పౌరసత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన భార్య, కొడుకుతో అక్కడే స్థిరపడాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన భార్య లోమాకు అమెరికా పౌరసత్వం ఉంది. దీంతో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీలంక మీడియా కథనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్న గోటబాయ.. 2019- శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పౌరసత్వం వదులుకున్నారు.

Exit mobile version