తెలంగాణలో విద్యా రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనఊరుమనబడి కార్యక్రమం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అన్నిరకాల మౌళికవసతులు కల్పించిన 1,240 పాఠశాలలను జనవరి 30న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.తాగునీరు అందించడం, పాఠశాలలకు రంగులు వేయడం, ఫర్నిచర్ మార్పిడి, వంటగదుల నిర్మాణం, గ్రీన్ చాక్ బోర్డ్స్, డైనింగ్ హాల్స్, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీని ఈ పథకం ద్వారా కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,497కోట్లు ఖర్చు చేయనుంది.