ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనెల 3వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ఈ నెల 30వ వరకు కొనసాగనుంది. అయితే ఈ కార్యక్రమం వెనుక టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేనప్పటికీ ఇంగ్లీష్ మీడియం పేరుతో.. ప్రభుత్వం పేదలకు దగ్గరవుతుందని చెబుతున్నారు. ఇది కేవలం ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పథకమని చెబుతున్నారు.