ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్ వాడకంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విషయమై విచారణ జరిపిన కోర్టు ఆఫీసు పనివేళల్లో సిబ్బంది మొబైల్ ఉపయోగించడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు తగిన విధివిధానాలను రూపొందించాలని చీఫ్ జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణియమ్ తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. తిరుచిరాపల్లి హెల్త్ రీజనల్ వర్క్‌షాప్ సూపరింటెండెంట్ ఆఫీసులోని తోటి సిబ్బంది ఎంత వారించినా వినకుండా వీడియోలను తీశారు. దీంతో ఉద్యోగులు తన ఫోన్ లాక్కోవడంతో దుర్భషలాడుతూ.. మరో అధికారిపై దాడి చేశారు. దీంతో ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగులు పని వేళల్లో ఫోన్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.