తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణ, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆయా శాఖలకు ప్రత్యేకంగా జీవోలు విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి అనుమతి లభించడంతో నియామక సంస్థలు ఆయా శాఖలను సంప్రదించనున్నాయి.