తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాశీ, శబరిమల వెళ్లే ప్రయాణికుల కోసం ఆయా చోట్ల వసతి గృహాలను నిర్మించాలని నిశ్చయించింది. ఈ మేరకు రూ.50 కోట్లు కేటాయించింది. అక్కడ ప్రభుత్వ స్థలం లభించకపోతే ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి రూ.25 కోట్లతో వసతిగృహ సముదాయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. త్వరలోనే స్థలం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ప్రతినిధులు కాశీకి వెళ్లనున్నారు. శబరిమలలో కూడా యాత్రికుల కోసం వసతిగృహ సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏటా రాష్ట్రం నుంచి వేల మంది యాత్రికులు కాశీ, శబరిమలకు తరలివెళ్తారు.