నారాయణ కాలేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్

Courtesy Twitter: trs party

నిన్న హైదరాబాద్- రామంతపూర్- నారాయణ కాలేజీ ఘటనపై మంత్రి సబిత సిరీయస్ అయ్యారు. నారాణయ కాలేజీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఘటపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కాలేజీలోని సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్షసాక్షులను విచారిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటర్ విద్యార్థి నారాయణ కాలేజీ ప్రిన్నిపల్ రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థితో పాటు గాయపడిన ప్రిన్సిపల్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version