అమరావతి- ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం కానుంది. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు.ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యమంలోకి వెళ్తామని ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డికి ఏపీ అమరావతి జేఏసీ నోటీసులిచ్చింది. ఉద్యమంలోకి వెళ్లక ముందే సమస్యను సెట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేతనల పెంపు, బదిలీలు వంటివాటిని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కొద్దికాలంగా ఆందోళనలు చేస్తున్నాయి.