తమిళనాడు పేరును ‘తమిళఘం’గా మార్చాలంటూ ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ RN రవి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేకనే ఇలా రాద్దాంతం చేస్తున్నారని RN రవి క్లారిటీ ఇచ్చారు. ‘నాడు’ అంటే ‘ప్రాంతం’ అని అర్థం ‘తమిళనాడు’ అది భారత్కు చెందని ఏదో ప్రత్యేక ప్రాంతంలా స్ఫురిస్తోందని ఆయన అన్నారు. తమిళఘం అంటే తమిళుల మాతృభూమి అని దీనివల్ల నష్టమేమీ లేదని ఆయన అన్నారు.