తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న లేఖపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారైనా పరేడ్ గ్రౌండ్లో వేడుకలు జరపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ వేడుకల అనంతరం గవర్నర్ ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లి అక్కడ కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటారు.