గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన ఫాంహౌజ్ కేసులోకి తననూ లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తన మాజీ ADC తుషార్‌ను ఈ కేసులోకి తెచ్చారని చెప్పారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన సమస్యలు పరిశీలిస్తున్నానని చెప్పారు. కానీ కావాలనేే విద్యార్థి సంఘాలతో రాజ్‌భవన్ ముందు ఆందోళనలకు రెచ్చగొడుతున్నారని గవర్నర్ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేయకపోయినా ఆందోళన చేయని విద్యార్థి ఐకాస, ఒక బిల్లు ఒక నెల తన వద్ద ఆగిపోగానే ఎందుకు ధర్నా చేస్తామంటోంది? దీని వెనక ఎవరున్నారు’? అని ప్రశ్నించారు.
MLAలకు ఎర కేసులో గవర్నర్ తమిళిసై?

© ANI Photo