కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ

Courtesy Twitter: tamilisy

గవర్నర్ తమిళిసై హైదరాబాద్- నిమ్స్‌ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం- కుటుంబ నియంత్రణ ఆపరేషన్(కు.ని) బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఇబ్రహీం పట్నం ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.

Exit mobile version