TS: గ్రూప్-4 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రూప్ పోస్టుల భర్తీ బాధ్యత ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చూసుకుంటోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నిబంధనలు రూపొందించి త్వరలోనే నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం ఉంది.