‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఈ షో గురించి తెలియని వారుండరు. విజయవంతంగా 13 సీజన్లు పూర్తిచేసుకుని త్వరలో 14వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే ‘కింది వాటిలో జీపీఎస్ ఉన్నది ఏది?’ అని అమితాబ్ అడగ్గా..రూ.2000నోటు అని కంటెస్టెంట్ చెబుతుంది. అది తప్పు అన్నా వినకుండా టీవీలో ఇదే చూపించారని సమాధానమిస్తుంది. అసత్య వార్తలను నమ్మొద్దని..ప్రతి విషయాన్ని మొదట నిర్ధారించుకోవాలని చెబుతూ ఈ వీడియో ముగుస్తుంది. వైరల్ అవుతున్నఈ వీడియోను మీరూ చూడండి.