అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా గండిపేటలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ నిర్మించారు. ఈ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, స్టూడియోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరుతో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ స్టూడియోస్‌లో మొదటగా పుష్ప-2 సినిమాను చిత్రీకరించనున్నారు.
Courtesy Twitter:
Courtesy Twitter:
Courtesy Twitter:
Courtesy Twitter: