కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, ఆర్జీవీ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. తనపై వీహెచ్ చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. “ తాతగారు మీరు ఇంకా బతికే ఉన్నారా? NASA యాక్ట్ వర్తించదు. TADA యాక్ట్‌ను 1995లోనే తీసేశారు. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కు ఆ గతి. ఒకసారి డాక్టర్‌కి చూపించండి” అన్నారు. దీనిపై పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. తాతగారు బతికే ఉన్నారంటూ వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి.