గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను వ్యాపారస్తులు, హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ వారు ఖాళీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు గడువు ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేస్తున్నారని గతంలో పలువురు వ్యాపారులు ఈ ఘటనపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ బెంచ్ ఈ పిటిషన్‌ని విచారించి తుది తీర్పు వెల్లడించింది. వ్యాపారస్తులు తాత్కాలికంగా బాటాసింగారంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌కి వెళ్లొచ్చని పేర్కొంది. ప్రభుత్వం కొహెడలో వీరికి శాశ్వత పండ్ల మార్కెట్ నిర్మించాలని యోచిస్తుంది.