హకీ ప్రపంచకప్లో భారత్ ఆరంభంలోనే అదరగొట్టింది. తొలి మ్యాచ్లో స్పెయిన్పై ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో ప్రత్యర్థి జట్టుపై గెలుపొందింది. అమిత్ రోహిదాస్, హార్దిక్ సింగ్ చెరో గోల్ వేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఒడిశాలోని రూర్కెలాలో మ్యాచ్ జరిగింది. ఈ విజయంతో జట్టు ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని పురుషుల జట్టు బరిలోకి దిగింది. ఈ దిశలో మెుదటి విజయాన్ని కైవసం చేసుకుంది.