దేశంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు మరింత ఊతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడుతున్న ఈ మిషన్‌కు ఈ ఏడాది రూ. 19, 744 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ఈ మిషన్ ద్వారా 2030 నాటికి రూ. 8 లక్షల పెట్టుబడులు, 6 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్రి లక్ష్యం.