AP: రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీగా మార్గం సుగమమైంది. పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో పోస్టుల భర్తీని నిలిపివేస్తూ విధించిన స్టేను ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. పరీక్షా నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం కాకుండా, విరుద్ధంగా పరీక్షను నిర్వహించారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా స్టేను ఎత్తివేసి 600 అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాలని సూచించింది.
పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Courtesy Twitter: