• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

    ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేయడంతో ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా 30,453 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 503 గ్రూప్-1 పోస్టులు ఉండగా శాఖల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. డీఎస్పీ 91, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, జైళ్ల శాఖలో డీఎస్పీ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ 20, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి 6, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ 35 పోస్టులు టీఎస్‌ఎస్పీ ద్వారా భర్తీ చేయనుంది. అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి.