కొన్ని సార్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘటనల వలన అనుకోని, అంచనా వేయలేని లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు ఇటువంటి ఒక విచిత్రమైన ఘటనే MPలోని అస్లానా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు వేర్వేరు వ్యక్తులతో ఒకే ముహూర్తానికి పెళ్లి నిశ్చయించారు. రాత్రి పూట ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఇదే వారి కొంప ముంచింది. సరిగ్గా ముహూర్తం సమయానికి పవర్ కట్ కావడంతో పెళ్లిళ్లు తారుమారయ్యాయి. ఒకరిని మనువాడాల్సిన వారు మరొకరి మెడలో తాళి కట్టారు. తర్వాత పెద్దలు వీరికి మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.