ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ -1 పరీక్షల్లో ఓ వ్యక్తి మాస్ కాపీయింగ్ చేశాడు. విజయవాడ బెంజి సర్కిల్లోని నారయణ కళాశాలలో ఉదయం కొల్లూరు వెంకటేశ్ అనే అభ్యర్థి ఏకంగా మెుబైల్ తీసుకొచ్చాడు. గూగుల్లో చూసి జవాబులు రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్ పోరంకి సచివాలయంలో పనిచేస్తున్నాడట. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 92 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ప్రశ్నలపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.