తెలంగాణలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను మరి కొద్దిరోజుల్లో జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ ను జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. కాగా, గ్రూప్-1 లో భాగంగా 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తం 19 శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా నోటిఫికేషన్ లేకపోవడంతో ఈ సారి దరఖాస్తులు లక్షల్లో వచ్చే అవకాశముంది.