TSPSC మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది. ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇంటర్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు 10 లక్షల మంది ఈ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ అయిన నోటిఫికేషన్‌కి భారీ స్పందన లభిస్తుంది.