గ్రూప్1 ప్రిలిమ్స్‌ను రెండు రోజుల్లో రద్దు చేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. గ్రూప్1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ నోరు మెదపకపోవడం దారుణమని మండిపడ్డారు.