తెలంగాణలో గ్రూప్ 2 పోస్టులు పెరగనున్నట్లు సమాచారం. త్వరలో గ్రూప్ 2, 3 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. మరి కొన్ని పోస్టులను గ్రూప్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది. రాబోయే నోటిఫికేషన్లో మొత్తం 783 ఖాళీలు ఉండే అవకాశం కనిపిస్తోంది. హాస్టల్ వార్డెన్ పోస్టులను కూడా గ్రూప్ 2 పరిధిలోకి తీసుకురావాలని కమిషన్ నిర్ణయించింది. అలాగే గ్రూప్ 3 పరిధిలోకి సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ ఉద్యోగాలను చేర్చనుంది.