గ్యాస్, వంటనూనె ధరలతో ఇప్పటికే సామాన్యుడు సతమతమవుతుంటే.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వారికి గుదిబండలా మారుతున్నాయి. అనేక నిత్యావసరాలను జీఎస్టీ పరిధిలోకి చేర్చారు. ఇకపై మాంసం, చేపలు, బియ్యం, గోధుమలు, చిక్కుడు గింజలు, పేలాల వంటివి ప్యాక్ చేసి అమ్మితే 5 శాతం జీఎస్టీ కట్టాలని నిర్ణయించారు. వంటగదిలో వాడే కత్తులు, స్పూన్లు, స్కిమ్మర్ల వంటివాటిపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచారు. రోజుకు రూ.1000 లోపు ధరలు ఉన్న హోటల్ గదులకు 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఎల్ఈడీ బల్బుల ధరలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచింది. దీంతో ఇవన్నీ ధరలు పెరగబోతున్నాయి.