షమీపై నోరుపారేసుకున్న..GT కెప్టెన్ పాండ్యా

Courtesy Instagram:Gujarat Titans

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేకుండా ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిన్న తొలి ఓటమిని రుచి చూపించింది. గుజరాత్ విధించిన 163 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు రెండు భారీ సిక్సర్లు ఇచ్చాడు. అదే ఓవర్లో కేన్ సహచర ఆటగాడు రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ ఆడాడు. కానీ ముందుకు వస్తే ఆ బంతి ఎక్కడ ఫోర్ పోతుందేమోనన్న అనుమానంతో థర్డ్ మ్యాన్ ఏరియాలో ఫీల్డింగ్ చేస్తున్న షమీ వెనక్కు వెళ్లి క్యాచ్ ట్రై చేయకుండా వదిలేశాడు. దీంతో హార్దిక్ కోపంతో ఊగిపోతూ.. షమీని బూతులు తిట్టాడు. దీనిపై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఆటలో ఇలాంటివి సహజమే అని అంత మాత్రానికే సీనియర్ల మీద నోరు పారేసుకోవడం సరైంది కాదని హార్దిక్‌కు సూచిస్తున్నారు.

Exit mobile version