ఐపీఎల్ 2022లో కొత్తగా అడుగుపెట్టిన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. వేలంలో అద్భుత ఆటగాళ్లను సొంతం చేసుకొని టైటిల్ వేటలో చేరారు. ఇక ఆ జట్టు కెప్టెన్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. అయితే, ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ కు ఇటీవల (నేషనల్ క్రికెట్ అకాడమీ) NCAలో యో-యో టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో పాండ్యా పాసైనట్లు తెలుస్తోంది. ఇందులో ఈ ఆల్ రౌండర్ గంటకు 135 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి, టెస్టులో 17 స్కోరు నమోదు చేశాడు. దీంతో బీసీసీఐ పాండ్యాకు ఐపీఎల్ లో ఆడే అవకాశం కల్పించింది.