నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన CSK నిర్ణిత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బ్యాటర్లలో గైక్వాడ్(53), ఎన్.జగదీశన్(39) మాత్రమే రాణించారు. అటు GT బౌలర్లలో షమీ 2 వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్, జోసెఫ్, సాయి కిషోర్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో GT గెలవాలంటే 134 పరుగులు చేయాల్సి ఉంటుంది.