ఆస్కార్‌ నామినేషన్స్‌కు గుజరాతీ ఫిల్మ్‌ ‘చెల్లోషో’

ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. భారత్‌ నుంచి ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్లాలన్న వారి ఆశ నెరవేరలేదు. భారత్‌ నుంచి ఆస్కార్‌కు గుజరాతీ సినిమా చెల్లోషోను నామినేట్‌ చేశారు. పాన్‌ నలిన్‌ తెరకెక్కించిన ఈ సినిమాను సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ నిర్మించారు. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు సమయ్‌, ఓ సినిమా హాల్‌ ప్రొజెక్టర్‌ రూంలోకి వెళ్తాడు. ఇక అప్పట్నుంచి సినిమాయే ప్రపంచంగా బతుకుతాడు. ఈ కథతో స్థానిక కుర్రాళ్లనే నటులుగా పెట్టుకుని నలిన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. 2021లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Exit mobile version