ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నాయకత్వంపై సొంతపార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జీ23 నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ బలోపేతంపై కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన గులాం నబీ ఆజాద్ నేడు అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. జీ23 నేతల సమావేశంలో సూచించిన అంశాలను సోనియాకు వివరించనున్నారు. ఈ సమావేశంలో సోనియా తో పాటు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.