హైదరాబాద్లో కాల్పులు..ఓ వ్యక్తి మృతి

© File Photo

భాగ్యనగరంలో కాల్పుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మాదాపూర్లో సోమవారం తెల్లవారుజామున మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇస్మాయిల్ ను ముజీబ్ అనే వ్యక్తి కాల్చాడు. ఈ ఘటనలో మరొకరికి గాయమైంది. విషయం తెలిసి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. స్థిరాస్తి గొడవలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version