గురుకులాల ప్రవేశ గడువు పెంపు

© ANI Photo

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో చేరే గడువును పెంచినట్లు అధికారులు తెలిపారు. గురుకులాల్లో చేరడానికి ఆగస్టు 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు టీజీ సెట్‌-2022 గతంలో నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై 29లోగా అప్లై చేసుకోవాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారు. దీంతో గడువు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version