H3N2 వైరస్‌పై కేంద్రం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వస్తున్న కేసులను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ముందు జాగ్రత్త గైడ్‌లైన్స్‌ను ICMR విడుదల చేసినట్లు గుర్తు చేసిన కేంద్రం… మార్చి చివరికల్లా ఈ కేసులు ఆగిపోతాయని పేర్కొంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ కారణంగా చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారు. రెండు మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.