గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే తన అర్ధశతకాన్ని తన పెంపుడు శునకానికి హిట్మ్యాన్ అంకితం చేశాడు. నిన్న రోహిల్ ప్రేమగా పెంచుకున్న తన శునకం చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. మ్యాజిక్ తమతో లేదన్న బాధలో అర్ధశతకం చేసిన రోహిత్… తన హాఫ్ సెంచరీని అంకితమిచ్చాడు. ఈ మ్యాచ్లో 41 బంతుల్లోనే అర్ధశతకం చేసిన రోహిత్ 83 పరుగులు చేసి ఔటయ్యాడు.