నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5(2019-21)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశ జనాభాలో దాదాపు 52 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. NFHS-4లో ఈ సంఖ్య 55 శాతం ఉండేదని కాని గత ఐదేళ్లలో ఈ సంఖ్య కొంచెం తగ్గిందని వివరించారు. అలాగే గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు.