• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వర్చువల్ మీటింగుల్లో సగం దండగే: సర్వే

    వర్చువల్ సమావేశాల వల్ల సమయం వృథా అవ్వడమే తప్ప ఉత్పాదకత ఉండట్లేదని ఫ్యూచర్ ఫోరమ్ సర్వే వెల్లడించింది. దాదాపు సగానికి పైగా మీటింగులు ఎలాంటి ప్రభావం లేకుండానే ముగిసి పోతున్నాయని పేర్కొంది. పై అధికారుల మెప్పు కోసమో, ఆత్మన్యూనతా భావమో దీనికి కారణం అయి ఉంటుందని అభిప్రాయపడింది. ఎగ్జిక్యూటివ్‌లు వారంలో సగటుగా 25 గంటలు, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు 10.6 గంటల పాటు మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో 43శాతం సమయం వృథా అవుతోందని ఫ్యూచర్ ఫోరమ్ వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.