హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్రమైన వేళ అణిచివేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్న మెుహసెన్ అనే వ్యక్తికి ఉరిశిక్షను విధించింది. సెప్టెంబర్ 25న టెహ్రాాన్‌లో రోడ్డు బ్లాక్ చేయటంతో పాటు భద్రతా సిబ్బందిని గాయపర్చినందుకు కోర్టు శిక్ష వేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా వారు కూడా సమర్థించారు. మరో 10 మందికి ఉరిశిక్ష విధించినట్లు తెలుస్తోంది. దీన్ని బూటకపు న్యాయ ప్రక్రియగా పలువురు అభివర్ణించారు. అంతర్జాతీయ. సమాజం బలంగా స్పందించాలని నార్వే ఐహెచ్‌ఆర్ అన్నారు.