1985లో జన్మించిన ఈ తమిళనాడు ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టుకున్నాడు. లెజండరీ కీపర్ గా ఉండడం వలన చాలా రోజుల పాటు డీకేకు ఇండియన్ టీంలో చోటు దక్కలేదు. కానీ ఆ తర్వాత చోటు దక్కింది. 2004లో టెస్టు, వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన డీకే ఆ తర్వాత రెండు సంవత్సరాలకు అంటే 2006లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డీకే అనే పేరు చెప్పగానే ఇండియన్ క్రికెట్ అభిమానులకు నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గుర్తుకు వస్తుంది. ఆనాటి ఫైనల్‌లో బంగ్లా చేతిలో ఓడిపోతామనుకున్న తరుణంలో డీకే ఆడి మ్యాచ్ గెలిపించిన తీరును ఏ అభిమాని అంత ఈజీగా మర్చిపోలేడు. అతడు అప్పుడు టీమిండియా పరువును మాత్రమే కాదు… కోట్లాది మంది అభిమానుల ఆశలను, నమ్మకాలను కూడా కాపాడాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌లో డీకే రెచ్చిపోయాడు. ఫినిషర్‌గా అదరగొట్టాడు. 16 మ్యాచుల్లో 330 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ మెరుపులు చూసే టీమిండియాలోకి మళ్లీ ఆహ్వానం అందింది. సఫారీ సిరీస్ లో ఈ స్టైలిష్ బ్యాటర్ ఎలా ఆడతాడో?