హ్యాపీ బర్త్‌ డే అజయ్ భూపతి

Courtesy Twitter:

నేడు డైరెక్టర్ అజయ్ భూపతి పుట్టిన రోజు. ఆర్ఎక్స్ 100 మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించారు అజయ్ భూపతి. తొలుత ఆయన డైరెక్టర్ రమేష్ వర్మ, వీరు పొట్ల దగ్గర ఆసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వద్ద ఆయన పనిచేశారు. వంగవీటి, కిల్లింగ్ వీరప్పన్ సినిమాలకు అజయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్‌ఎక్స్ 100 మూవీ హిందీలోనూ రీమెకై మంచి విజయం సాధించింది. తెలుగులో ఆయన తీసిన మహాసముద్రం సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ HAPPY BIRTHDAY అజయ్ భూపతి గారు.

Exit mobile version