నేడు నటి అంజలి 36వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆమె జూన్ 16, 1986న ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలు, తూర్పుగోదావరిలో జన్మించింది. తెలుగులో మొదట 2006లో ఫోటో సినిమాలో కనిపించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో సీత పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది. ఈ సినిమాకు నంది అవార్డును కూడా గెలుచుకుంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో ఎక్కువ గుర్తింపు పొందింది. కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. ఇప్పటివరకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మొత్తం 12 పురస్కారాలను అందుకుంది.