హ్యాపీ బ‌ర్త్‌డే డైన‌మిక్ డైరెక్ట‌ర్ బాబీ

నేడు ప్ర‌ముఖ టాలీవ‌డ్ ద‌ర్శ‌కుడు బాబీ (కే.ఎస్ ర‌వీంద్ర‌) బ‌ర్త్‌డే. బాబీ మొద‌ట ద‌శ‌ర‌థ్‌, గోపీచంద్ మ‌లినేని వంటి డైరెక్ట‌ర్ల వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. 2014లో ర‌వితేజ‌తో మొద‌టి సినిమా ప‌వ‌ర్ తెర‌కెక్కించాడు. ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్థార్ గ‌బ్బ‌ర్‌సింగ్, ఎన్‌టీఆర్‌తో జై ల‌వ‌కుశ‌, వెంకీమామ వంటి చిత్రాలు చేశాడు. ప్ర‌ముఖ చెస్ చాంపియ‌న్ ద్రోణ‌వ‌ల్లి హారిక సోద‌రి అనూష‌ను బాబీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2018లో ఒక పాప జ‌న్మించింది. ప్ర‌స్తుతం ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్‌ మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌వితేజ కూడా ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Exit mobile version