భారత సినీసంగీతానికి వన్నె తెచ్చిన ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా పుట్టినరోజు నేడు. ఇళయరాజా జూన్ 2, 1943న చెన్నైలో జన్మించాడు. మ్యూజిక్ గాడ్‌గా పిలుచుకునే ఇప్పటివరకు 1400 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. 7000 పాటలు కంపోజ్ చేశాడు. 20 వేలకు పైగా మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించాడు. ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను 5 నేషనల్ అవార్డ్స్, ఇండియాలో అత్యంత ప్రతిస్టాత్మకమైన సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి.