ఫుట్‌బాల్ ఆట చూసేవాళ్లకు, ఆ ఆటను ఆడే వాళ్లకు లియోనార్డో మెస్సీ గురించి పరిచయం అవసరం లేదు. 1987 జూన్ 24వ తేదీన పుట్టిన మెస్సీ.. తన టెక్నిక్ ఆట విధానంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ గేమ్స్, టోర్నమెంట్స్‌లలో ఎన్నో వందల గోల్స్ చేసి చెరగని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మైన్ F.C, అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్న అతడు.. కోట్లలో సంపాదిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. నేడు లియోనార్డో మెస్సీ పుట్టినరోజు. షార్ట్ న్యూస్ యాప్ Yousay తరఫున ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి హ్యాపీ బర్త్‌డే.