నేడు సన్నీ లియోన్ బర్త్ డే. సన్నీ లియోన్ మే 13, 1981న కెనడాలో సిక్కుల కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు కరణ్‌జీత్ కౌర్. బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచిన సన్నీ.. బోల్డ్, సాధికారత గల నటిగా భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత సన్నీలియోన్ పేరు ఇండియాలో బాగా పాపులర్ అయిపోయింది. ఈ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక పత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సన్నీ ఫిల్మ్ మేకర్ డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. నిషా అనే పాపను దత్తత తీసుకోగా, సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు. సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో గాలి నాగేశ్వరరావు సినిమాలో నటిస్తుంది.